13 August, 2026 | 5:04 AM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి

13-08-2026 12:00 AM

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్

కామారెడ్డి, ఆగస్టు 12 (విజయక్రాంతి):  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ అధికారులకు, మండల తహసిల్దార్లకు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మెమోరండం సమర్పించారు. లంచ్ అవర్ లో ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రోడ్డ ప్రభాకర్ కి, ఎల్లారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్ కి మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ పి ఆర్ సి గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని అన్నారు, తక్షణమే పీఅర్సీ రిపోర్టు తెప్పించుకుంటానని  చెప్పిన  ముఖ్యమంత్రి  మాటలు అమలులోకి రాలేదని అన్నారు.

పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏ లను, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.  సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యాన ఆగస్టు 12,13 న మండల కేంద్రాల్లో మెమోరాండంలు, 19 న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29 న ఇందిరా పార్క్ లో మహా ధర్నా. అప్పటికీ స్పందన లేకుంటే సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు గౌత నాగరాజు, ఫెడరేషన్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ch,రమేష్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.