calender_icon.png 24 February, 2026 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ఉత్తమ ప్రతిభ

24-02-2026 12:00:00 AM

  1. 21 పతకాలతో సత్తా చాటిన  క్రీడాకారులు

అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోరట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఇందులో 6 బంగారు, 8 రజత, 7 కాంస్య పతకాలతో మొత్తం 21 పతకాలు సాధించి జిల్లాను ముందు వరుసలో నిలిపారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజేతలకు పతకాలు అందజేసిన ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపుఓటములు సహజ మని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు. బంగారు పతకాలు సాధించిన వారిలో ఈడీ. సజీవ్ బ్యాడ్మింటన్, బి.ఆదిత్య సాంప్రదాయ యోగా, బి.ఆదిత్య ఆర్టిస్టిక్ యోగా సింగిల్, ఆర్.సాయిరామ్ వెయిట్ లిఫ్టింగ్, కె. జ్యోతి  పవర్ లిఫ్టింగ్, భాగ్యవతి  వెయిట్ లిఫ్టింగ్ ఉన్నారు. రజత పతకాలు సాధించిన వారిలో ఈడీ.సజీవ్ బ్యాడ్మింటన్ డబుల్స్,

జి.సంతోష్ కుమార్ తైక్వాండో, డి.మధు రెజ్లింగ్, ఎల్.చంద్రశేఖర్  రెజ్లింగ్, ఎల్.చంద్రశేఖర్  వెయిట్ లిఫ్టింగ్, ఎన్.చంగున, కె.శ్రావ్య  బ్యాడ్మింటన్, కె.శ్రావ్య  వెయిట్ లిఫ్టింగ్, కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.శ్రావ్య షాట్పుట్, వి.దేవి సింగ్ రెజ్లింగ్, కె.సాయి తేజ గౌడ్ బాక్సింగ్, పి.ప్రతాప్ రాథోడ్ వెయిట్ లిఫ్టింగ్, జె.శివ కుమార్  ఆర్టిస్టిక్ యోగా సింగిల్, ఎల్.రవి కుమార్ రెజ్లింగ్ లో గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఆర్.ఐ డానియెల్, రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ శ్రీశైలం, అశోక్ పాల్గొన్నారు.