4 August, 2026 | 12:26 AM

మన చేయూత గ్రూపు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు వస్తువులు అందజేత

03-08-2026 09:42 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ లోని RSS సేవాభారతి పర్యవేక్షణలోని నిజామాబాదులోని కిసాన్ నగర్ లో గల శ్రీ నచికేత ఆవాస ( ఆశ్రమ ) కేంద్రంలో ప్రతి నెల కొనసాగుతున్న వివిధ కార్యక్రమంలో భాగంగా జులై నెల మాసవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు నందాల శంకర్ 22 మంది పేద విద్యార్థులకు కావలసిన వివిధ ఉపయుక్తమైన 13 రకాల వివిధ వస్తువులైన స్టీలు వాటర్ బాటల్స్, షెటిల్ బ్యాట్స్, చెస్ బోర్డ్స్, వస్త్రములు(డ్రాయర్స్), బాల్స్, కాక్స్, స్కెచ్ పెన్స్, సబ్బు పెట్టెలు, ఏరజర్స్, షార్ప్నర్స్, పండ్లు, బిస్క్యూట్ పాక్స్, చాక్లెట్ ప్యాక్ మొదలగువాటిని  అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి  సహకరించిన   ఆవాస కేంద్ర నిర్వాహకులకు, ఇంచార్జ్ కుమార్,B విజయలక్ష్మి సాయులు, R గంగాధర్, ఆర్మూర్ సోని లకు ధన్యవాదములు తెలియచేశారు.