26 August, 2026 | 3:30 AM

గొల్లపల్లి మండలంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ

26-08-2026 02:10 AM

ధర్మపురి, ఆగస్టు25 (విజయక్రాంతి): గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సకాలంలో అందేలా రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.గొల్లపల్లి మండలంలో 34 రేషన్ షాపుల పరిధిలో సుమారు 17 వేల రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ , అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.