స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
24-08-2026 05:56 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సోమవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో జిపీవో రాజేష్, రేషన్ డీలర్ బొల్లపెల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు రామగిరి సంజీవ్, నారాయణ, మణికాంత్, లక్ష్మీ, లత అనూష, గంగమణి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






