24 August, 2026 | 7:24 PM

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

24-08-2026 05:56 PM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సముదాయ పోలీసింగ్‌పై అవగాహన సదస్సు

అశ్వాపురం, ఆగస్టు 24(విజయక్రాంతి): అశ్వాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సముదాయ పోలీసింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై భూక్యా శాంతి విద్యార్థులతో మాట్లాడుతూ బాలికలు, విద్యార్థినులు వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ వంటి సమస్యలు ఎదురైతే భయపడకుండా పోలీసులను, షీ టీమ్‌ సభ్యులను సంప్రదించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు చెడు స్నేహాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సీహెచ్‌. వీర్రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, విద్యార్థుల భద్రత, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు. పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.