నాగోల్‌లో ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాల పంపిణీ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ప్రజలకు అవగాహన కల్పించిన బీఎల్‌ఏ ప్రతినిధులు
నాగోల్, జూలై 3 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నాగోల్ డివిజన్ పరిధిలోని గణేష్నగర్ కమ్యూనిటీ హాల్లో పీఎస్ -79, 80 పోలింగ్ స్టేషన్ల పరిధికి చెందిన ఓటర్లకు ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఏ- 2 ప్రతినిధి దావనూరి మమత... ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఓటర్లకు సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించేందుకు సహకరించాలని ఆమె కోరారు.






