calender_icon.png 24 February, 2026 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థులకు పాఠశాల బ్యాగులు పంపిణీ

24-02-2026 01:03:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): మారుమూల ప్రాంతమైన రేగుల్‌గూడ గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 30 మంది గిరిజన ఆదివాసీ విద్యార్థులకు పాఠశాల బ్యాగులు పంపిణీ చేసి సిర్పూర్ పేపర్ మిల్లు జనరల్ మేనేజర్ ఎం.ఎస్. గిరి ఉదారత చాటుకున్నారు.

గత వారం పాఠశాలను సందర్శించిన ఎం.ఎస్. గిరి విద్యార్థుల వద్ద పాఠశాల బ్యాగులు లేనిది గమనించి, త్వరలోనే బ్యాగులు అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కొత్త బ్యాగులను అందజేశారు.ఈ సందర్భంగా ఎం.ఎస్. గిరి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామ పెద్దలు సిర్పూర్ పేపర్ మిల్లు జనరల్ మేనేజర్ ఎం.ఎస్. గిరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ రాథోడ్ రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు లావుడ్యా శంకర్, గ్రామపంచాయతీ సర్పంచ్ వాడై సుశీల, ఉపసర్పంచ్ సోయం లచ్చు, గ్రామ పటేల్ సోయం సుంగు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.