రేపు రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
14-08-2026 08:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. సోన్ మండలంలోని కడ్తాల్ వైట్ జంక్షన్ సాగర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని ఈ కార్యక్రమాన్ని జిల్లా పౌరాసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.






