14 August, 2026 | 10:27 PM

73 మందికి రూ.5.49 లక్షల ఫైన్

14-08-2026 08:55 PM

సిద్దిపేట క్రైం: ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 73 మంది నిబంధనలు అతిక్రమించారని, వారిని శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. 40 మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారికి రూ.3 లక్షల 84 వేల 5 వందలు జరిమానా విధించారని పేర్కొన్నారు. వారిలో  ఇద్దరికీ అయిదు రోజులు, ఒకరికి 10 రోజులు, ఇంకొకరికి 3 రోజులు జైలు శిక్ష విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 33 మందికి రూ. లక్షా 65 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని సీఐ ముత్యంరాజు వెల్లడించారు.