పారుపల్లిలో బోడ సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్మోహన్ రావు
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బోడ శ్యామల బాపు గౌడ్ తండ్రి బోడ సమ్మయ్య మృతి చెందగా, శుక్రవారం నిర్వహించిన మూడో రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బోడ సమ్మయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బోడ సమ్మయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, జిల్లా సెక్రటరీ అంబటి చంద్రమోగిలి, సీనియర్ నాయకులు పెద్దుల బొండాలు, పీక శంకర్, బోడ శ్రీను, ఇనుముల ప్రదీప్, సోతుకు రాజేందర్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






