పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం
- పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం
- గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
- విద్యార్థులకు మందుల పంపిణీ
గణపురం,జూలై 13 విజయక్రాంతి: రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యమని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గణపురం మండల కేంద్రంలో సోమవారం గణపురం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య రక్షణలో భాగంగా నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ మందులు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కాయిత జలంధర్ పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






