అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF cheques) నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్,పల్లెబోగుడ తండా గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని గ్రామ సర్పంచులు ధనావత్ పార్వతీశంకర్,యాదవ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య మాట్లాడుతూ...స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండలంలోని 11 గ్రామాలలో 17,01,972 రూపాయల 17 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.దీనితో లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు అత్యవసర సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినందుకు ఎమ్మెల్యేకు ఎంతగానో రుణపడి ఉంటామన్నారు.పేద ప్రజలను గుర్తించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తాండూర్,పల్లె బోగుగూడ తండా గ్రామ సర్పంచ్లు యాద గౌడ్,ధనావత్ పార్వతీశంకర్,కాంగ్రెస్ నాయకులు సంజీవులు, వేముల సంగయ్య,మధు, మునిగేపల్లి సంగయ్య,సన్నీ, బన్సీ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.




