26 February, 2026 | 5:54 PM

మోసం గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

26-02-2026 03:34 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్నగర్ మండలంలోని మోసం గ్రామంలో పోచమ్మ అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత అయిన పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి వేద మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అమ్మవారికి పట్టువస్త్రాలు,  సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల సంక్షేమం, శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు.

ఈ వేడుకలో సర్పంచ్ భీమన్ కార్ పద్మ  వసంత్ రావు, ఉప సర్పంచ్ రోహిణి పుష్పలత  రామయ్య, మాజీ సర్పంచ్ కునుషోత్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రౌతు సంతోష్, వార్డ్ మెంబర్లు అంబిలపు గురు, కునుషోత్ దేవయ్య, రమేష్, సత్యన్న, పిప్పిరె పురుషోత్తం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. అన్నదాన కార్యక్రమం  నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రాణప్రతిష్ఠతో గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.