26 February, 2026 | 5:54 PM

రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి పదవీ బాధ్యతల స్వీకరణ

26-02-2026 03:29 PM

 స్వామిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు 

రామగుండం,(విజయక్రాంతి):  రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి మేయర్‌ మహంకాళి స్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శ్రీనుబాబు అభినందించారు.