25 June, 2026 | 3:36 AM

ఎలివేటెడ్ కారిడార్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

25-06-2026 01:09 AM

మేడ్చల్, జూన్ 24(విజయ క్రాంతి): సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన  తూంకుంట రైతులకు కలెక్టర్ మను చౌదరి చెక్కులు అందజేశారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్లో సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు రాజీవ్ రహదారి నిర్మాణానికి తూంకుంట గ్రామంలో 24 ఏకరాలకు గాను మూడవ విడతగా  స్థలాన్ని ఇచ్చిన రైతులకు డిఆర్‌ఓ మాలతితో కలిసి రూ.86 కోట్ల చెక్కులను  అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ దఫాగా ఈ చెక్కులు అందించడం జరిగిందని, మిగిలిన వారికి తరువాత అందించడం జరుతుందని తెలిపారు.