13 May, 2026 | 10:02 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

శ్రీశైల పాదయాత్రికులకు అన్నప్రసాద వితరణ

13-03-2026 12:50 AM

అలంపూర్ మార్చి 12:అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయ సముదాయంలో శ్రీశైల పాద యాత్రికుల కోసం, రాయ చూరు జిల్లా ఇడుపునూరు శ్రీ మఠం శివశ్రీ మంజునాథ స్వామి మరియు విశ్వ నాథ స్వామి, వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ మూడు  రోజులుగా కొనసాగుతుందని తెలిపారు. శ్రీ మఠం  గురువుగారి ఆధ్వర్యంలో  శిష్య బృందం భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

గత ఆరు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జోగులాంబ అమ్మ వారి ఆశీర్వాదంతో కొనసాగిస్తున్నామని, భక్తులందరి సహకారాలతో పాదయాత్రికు లకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, శ్రీవ శ్రీ మఠం మంజునాథ స్వామి తెలిపారు.ఈ కార్యక్రమం ఏడవ సంవత్సరం కొనసాగుతుందని భక్తులందరూ, నిస్వార్థంగా  ఒకరికి ఒకరు గౌరవించుకుని , కుటుంబం  లో తల్లి తండ్రిని గౌరవించి, కుటుంబ వ్యవ స్థను బలోపేతం చేయాలని అలాంటప్పుడే సనాతన ధర్మం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా శ్రీ మంజునాథ స్వామి తెలియజేశారు.