12 June, 2026 | 1:24 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

12-06-2026 12:16 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్, జూన్ 11 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఆర్ గా ర్డెన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు చెందిన 200 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ... కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చా రు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఉచిత కరెంటును అందజే స్తూ అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. సీ ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాసిల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, మార్కెట్ కమి టీ చైర్మన్ గీత,వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బిచ్య నాయక్, సర్పంచులు బిక్షపతి,కరుణాకర్ గౌడ్, మహేందర్ గౌడ్, వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.