కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): సైబరాబాద్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా శనివారం మున్సిపల్ కమీషనర్ శ్రీజన, జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కడే,ఇతర ఉన్నతాధికా రులతో కలిసి వివిధ కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నీటి పొదుపు ఇంకు డు గుంతల నిర్మాణం రాబోయే వేసవి కాలా న్ని దృష్టిలో ఉంచుకుని నీటి వృధాను అరికట్టాలని అధికారులను కోరారు.
ప్రతి ఇంట్లో కాలనీ ఖాళీ ప్రదేశాలలో తప్పనిసరిగా ఇంకు డు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జల మట్టం పెరుగు తుందని, భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదని వివరించారు. కాలనీలలోని పార్కులను సుందరీకరించడంతో పాటు, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులలో వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటస్థలాలు సరై న లైటింగ్ వ్యవస్థ ఉండేలా చూడాలని కాలనీ అసోసియేషన్లకు సూచించారు.
పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణ కోసం చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా, తడి-పొడి చెత్తను వేరు చేసి ము న్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. కాలనీలను ’జీరో వేస్ట్’ జోన్లుగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాలనీ అసోసియేషన్ల భాగస్వామ్యం స్థానిక సమస్యల పరిష్కారంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు క్రియాశీలక పాత్ర పోషించాలని, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని కమీషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జోన ల్ అధికారులు, సర్కిల్ స్థాయి అధికారులు వివిధ కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.






