ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపం
పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి అదృశ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందిన యువకుడు ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం యాప్రాల్లోని జై జవాన్ కాలనీలో చల్లా సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. కుమారుడు చెల్లా బాలాజీ( 17) ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్లో 400 మార్కుల పైగా వస్తాయని ఆశించిన బాలాజీకి 300 మార్కులే రావడంతో మనస్థాపన చెందాడు. ఈనెల 13న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికినా బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




