కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)
కాసిపేట: శుక్రవారం ఉదయం మందమర్రి ఏరియా కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ సిష్టం ప్రారంభించిన డైరెక్టర్ కొప్పుల వేంకటేశ్వర్లు. కార్మికుల నడకను తగ్గించి చైర్ సిస్టం ద్వారా పని స్థలానికి సులువుగా వెళ్లేందుకు ఏర్పాటు చేసి కార్మికుల కు ఉపయోగంలోకి తెచ్చారు. అనంతరం సమావేశంలో ఉద్యోగుల ను ఉద్దేశించి డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాని లో నాణ్యమైన బొగ్గు ఉన్నందున కార్మికులు వాటికి తీయుటకు కృషి చేయాలని యువ కార్మికులు సంస్థ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
సంస్థ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.జనరల్ మేనేజర్ రాధ కృష్ణ మాట్లాడుతూ గాని భవిషత్ బాగుందని,కాసిపేట గని కార్మికులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారిని అన్నారు.చుట్టు పక్కల గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేస్తున్నామని అన్నారు,గని విస్తీర్ణతకు కొంత ల్యాండ్ సేకరించడం జరిగిందని అన్నారు.బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ... గని ఏర్పాట్లు లో డైరెక్టర్ గారి పాత్ర ప్రధానమైనది అన్నారు.
కాసిపేట ఉద్యోగులు బొగ్గు రంగ పరిశ్రమలో ఎన్నో రికార్డులు నెలకొల్పినారని నైపుణ్యంతో పని చేసే ఉద్యోగులుఉన్నారని, గనికి నూతన ఎస్ డి ఎల్స్,సేఫ్టీ మెటీరియల్స్ అందించాలని అన్నారు. ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ... గనిలో నాణ్యత కల్గిన బొగ్గు ను తీస్తూ రక్షణతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సతీష్, ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, పర్సనల్ మేనేజర్ అశోక్, ఇంజనీర్ ఝా, బాబు, సలేంద్ర సత్యనారాయణ, మీనుగు లక్ష్మీ నారాయణ, రక్షణ అధికారి నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, హిమాలయ, సంక్షేమ అధికారి మీర్జా, బన్న లక్ష్మన్ దాస్, రాజేందర్, సంతోష్, శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.






