24 April, 2026 | 7:21 PM

చదువుతోపాటు సంస్కారం అవసరం

24-04-2026 05:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పాలని బిజెపి పార్లమెంటు ఇంచార్జ్ అయ్యన్న గారి భూమయ్య అన్నారు. పట్టణంలోని విజయ హై స్కూల్ శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. విద్యారంగంలో పోటీ నేపథ్యంలో విద్యతో పాటు మానవు విలువలను కూడా నేర్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నాగభూషణం ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి సభ్యులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు