దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి, మే 16 (విజయక్రాంతి): దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆలింకో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అవసరమైన సహాయ పరికరాలను పంపిణీ చేశారు. దివ్యాంగులు విద్యాభివృద్ధికి, వారి దైనందిక జీవితంలో ఎవరిపైన ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించండి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం అభినందనీయం అన్నారు.
ఈ పరికరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, కౌన్సిలర్ గ్యార అఖిల, మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, పోచమ్మ, నాగవేందర్, విద్యాశాఖ అధికారులు పూర్ణచందర్, వేణు శర్మ, సంబంధిత శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






