‘నోటరీ పరశురాం’ కేసు గెలిచాడా?
శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేశ్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ‘నోటరీ పరశురాం’ అనేది దీనికి ట్యా గ్‌లైన్. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ‘ప్రాబ్లమ్ కేసు గురించి కాదు.. ప్లేస్ గురించి’, ‘ఆయన ప్రాణం పోయినా ఏ బ్లాక్ వైపు వెళ్లడు’, ‘నా 20 ఏళ్ల సర్వీసులో ఆ నోటరీని ఈ కోర్టులో ఎప్పుడూ చూడలేదు’, ‘నాకు ఆయనలాగా ఫెయిల్యూర్ లాయర్ కావాలని లేదు’ వంటి డైలాగులు చూస్తుంటే.. హీరో శ్రీకాంత్ ఇం దులో నోటరీ లాయర్ పరశురాం పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది.
ఎన్నో ఏళ్లు గా కేసులు వాదించని పరశురాం.. ఓ ఆత్మాహుతి కేసును ఎందుకు టేకప్ చేశాడు? సమీరను ఎవరు కిడ్నాప్ చేశారు? పరశురాం కేసును గెలిచాడా? లేదా? అనే సందే హాలు తలెత్తేలా కట్ చేసిన ఈ ట్రైలర్.. సిరీస్‌పై అంచనాలు పెంచేసింది. ఈ సిరీస్‌కు అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చగా, సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.






