కోహెడ ప్యాక్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవేందర్‌రావు
కోహెడ, మే 6 : కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా పేర్యాల దేవేందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 19 డిసెంబర్ 2025 న ప్రభుత్వం ఇచ్చిన జీవో నం. 597 విరమించుకోవడం తో పాత పాలకవర్గాలకే బాధ్యతలు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలు మేరకు పాలకవర్గం తో కలిసి బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు.
అలాగే గొట్లమిట్ట లో ప్యాక్స్ ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. సంబందించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలను తెలిజేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు మ్యాకల సురేందర్ రెడ్డి, నీరటి దేవయ్య, పబ్బతి సుగుణమ్మ, జేరిపోతుల మణెమ్మ, బొబ్బల కొండల్ రెడ్డి, సిఈఓ ముంజ మల్లికార్జున్ మాజీ సర్పంచ్ చింతలపెల్లి ప్రతాప్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.






