చరిత్ర సృష్టించిన కెనడా
30-06-2026 12:20 AM
తొలిసారి ప్రీక్వార్టర్స్‌లోకి ఎంట్రీ
లాస్ ఏంజెల్స్, జూన్ 29: సాకర్ ప్రపంచకప్‌లో కెనడా చరిత్ర సృష్టించింది. తొలిసారి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కెనడా 1 స్కోరుతో సౌతాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ చివరి నిమిషంలో కెనడా మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ యూ స్టాకియో కొట్టిన గోల్ ఆ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. మ్యాచ్ ప్రా రంభం నుంచే ఇరు జట్లు గోల్ కోసం హో రాహోరీగా తలపడ్డాయి. 92వ నిమిషంలో యూస్టాకియో అద్భుతం చేశాడు. ఈ ఏకైక గోల్‌తో కెనడా మొట్టమొదటిసారి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది.






