మహిళలు సమాజంలో రాణించినప్పుడే అభివృద్ధి
లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్
తుంగతుర్తి,(విజయక్రాంతి): మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, వివిధ రంగాల్లో రాణించిన పలువురి మహిళలకు, శాలువాతో ఘనంగా సన్మానించి, స్వీట్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ చదువుతోపాటు, అన్ని రంగాల్లో రాణించుటకు, ప్రభుత్వం పెద్దపీటవేయాలని, కోరారు. కుటుంబంలో పాటు, సమాజం అభివృద్ధి చెందాలంటే, మహిళలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ, పారిశ్రామిక రంగంలో రాణించుటకు, ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని కోరారు. సన్మాన గ్రహీతలు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ లావణ్య, మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు జమున, కరాటే మాస్టర్ బొంకూరి అరుణ, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు గుమ్మడవెల్లి అరుణ, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనూష, ఆరోగ్య సిబ్బంది భారతి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, ప్రధాన కార్యదర్శి పులుసు వెంకన్న, కోశాధికారి గుండ గాని రాము ప్రోగ్రాం, కోఆర్డినేటర్లు పులుసు వెంకటనారాయణ గౌడ్, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్, ఎనగందుల గిరి, గుమ్మడవెల్లి శ్రీను, దాసు తదితరులు పాల్గొన్నారు.




