గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్
- 150 గ్రాముల గంజాయి స్వాధీనం
- గంజాయి సరఫరా గుట్టు రట్టు
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. గంజాయి కేసులో ఒకరిని అరెస్టు చేశారు. ఎస్ఐ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం..విశ్వసనీయ సమాచారం మేరకు బెల్లంపల్లి నివాసి ఎస్ కే జమీర్ దేవాపూర్ MPPS పాఠశాల ముందు నల్లరంగు కవర్‌తో అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
హుటాహుటినా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న నల్లరంగు కవర్‌ను పోలీసులు తనిఖీ చేయగా, 150 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిని పోలీసులు విచారించగా,గంజాయి గుట్టంతా బయట పడింది. నిందితుడు బెల్లంపల్లి బస్తీ కి చెందిన వాడనీ గుర్తించారు. విచారణలో నిందితుడు గంజాయి సమాచారాన్ని వెల్లడించారు. తెలిసిన గంజాయి వినియోగదారుల పేర్లు చెప్పాడు.
బెల్లంపల్లికి చెందిన A2)MD.యోనిస్, A3)చంటి, A4)బన్ని, A5)తాజ్ బాబా, A6)విష్ణు, A7)కిరణ్, A8)సమీర్, A9)అజయ్ లకు గంజాయిని విక్రయించి డబ్బులు సంపాదించేవాడినని విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు నిందితుడు A1) SK. జమీర్పై NDPS Actలోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(A), 27(b) కింద దేవాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే, మిగిలిన వ్యక్తులపై A2 నుండి A9 వరకు వారిపై NDPS Actలోని సెక్షన్ 27(b) కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడు SK. జమీర్‌ను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ ఐ గంగారాం వివరించారు.






