27 August, 2026 | 11:08 PM

Breaking News

ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి   •   జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ   •   రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే   •   జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు   •   గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక   •   కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే   •   పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు   •   ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం   •   గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు   •  

దాతల సహకారంతో సైన్స్ ప్రయోగశాల ఏర్పాటు

27-08-2026 06:06 PM

ఆళ్ళపల్లి ,ఆగస్టు 27, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  గ్రామ పెద్దల ఆర్థిక సహకారంతో అధునాతన సైన్స్ ప్రయోగశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ వాసం సుస్మిత, తాసిల్దార్ ఉమారాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్, విద్యాధికారి కే శాంతారావు అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను గురువారం ప్రారంభించారు  కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి ప్రయోగశాల ఎంతో అవసరమన్నారు. గ్రామ పెద్దలు ముందుకు వచ్చి విరాళాలు అందించి ల్యాబ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దీనివల్ల మన పాఠశాల విద్యార్థులు ప్రయోగాలు చేసి సైన్స్ ను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. తమ గ్రామ పిల్లలు సైంటిస్టులు, డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఈ ల్యాబ్  ఏర్పాటుకు సహకరించడం జరిగిందని, ఈ సైన్స్ ల్యాబ్ ను విద్యార్థులు వినియోగించుకుని గొప్ప స్థాయికి రావాలని ఈ సందర్భంగా సూచించారు. ఒక ల్యాబ్ ఏర్పాటు కి విరాళాలు అందించిన దాతలు గౌరిశెట్టి శ్రీనివాసరావు, అబ్బు నాగేశ్వరరావు, బూరుగడ్డ రా ములు ,అనుమోలు వెంకటేశ్వరరావు, సయ్యద్ హఫీస్, వాసం శ్రీకాంత్ ,నరెడ్ల వెంకన్న ,డాక్టర్ నయూం ,రేసు ఎల్లయ్య ,గుంతోజు శ్రీనివాస్ సిరినోముల  వజ్రేశ్వరరావు, ఈసం సాంబశివరావు ,గౌరిశెట్టి చంద్రశేఖర రావు, సిరునోముల సతీష్, విరాళాల అందించారు .