28 August, 2026 | 8:19 AM

మై భారత్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ వర్చువల్ కార్యక్రమం

27-08-2026 06:09 PM

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహణ 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 27( విజయక్రాంతి ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన అధికారి భూక్య సంజీవ్ ఆదేశాల మేరకు మై భారత్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి కే సాత్ వర్చువల్ కార్యక్రమాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఏ రమణరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీ రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీ వెల్దండ సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. రమణ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కవిత, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.