4 June, 2026 | 11:21 PM

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభానికి సమాచారం ఇచ్చిన రాలేదు

04-06-2026 05:55 PM

దేశాయిపేట ఇందిరమ్మ లబ్ధిదారుడు మహిబూబ్...

బాన్సువాడ, జూన్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మహిబూబ్ తన ఇందిరమ్మ ఇంటి ప్రారంభానికి గ్రామ సర్పంచ్ తో పాటు, గ్రామ కార్యదర్శికి గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, నాయకులకు సమాచారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ రాలేదన్నారు. అయితే  గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వకుండానే ప్రారంభించడం జరిగిందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా సమాచారం ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ జ్యోతి ప్రకాష్ ఆరోపించడం అవాస్తవమని లబ్ధిదారులు మహిబూబ్ తెలిపారు.

ఒక పేద లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకొని ప్రారంభానికి  గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి పిలిచిన రాకపోవడంతో పాటు రాజకీయం చేయడం పట్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి గీతాను విజయ క్రాంతి వివరణ కోరగా లబ్ధిదారులు ఇంటి ప్రారంభానికి సమాచారం ఇచ్చారని అయినప్పటికీ ఇతర కార్యక్రమాలు ఉండడం వలన వెళ్లలేకపోయానని ఆమె తెలిపారు. ఇది కావాలని రాజకీయం చేస్తున్నారని ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని మాజీ సర్పంచ్ శ్రావణ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.