కురిసిన భారీ వర్షానికి తెగిన రోడ్డు
29-07-2026 04:09 PM
బోధన్,(విజయక్రాంతి): రుద్రూర్ మండలంలోని రాయకూర్ శివారు నుంచి బోధన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొరంతో కూడిన రహదారి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం రోడ్డు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులను అప్రమత్తం చేసి, ఈ మార్గంలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించి రాకపోకలు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.






