నిజాంపేటలో ఇంటిపై పిడుగుపాటు
భారీ వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం..
రామాయంపేట,జూన్4(విజయక్రాంతి): మండల కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన పంజా శ్రీనివాస్ 4వ అంతస్తు బిల్డింగ్ పై పిడుగు పడడం జరిగింది. ఈ పిడుగుపాటు వల్ల బంగ్లా పై ఉన్నటువంటి పీలేరు వాటర్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకేసారి పెద్ద ధ్వనితో పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఒకేసారి ఉలికిపడి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేద కానీ గ్రామంలో పిడుగు పడడం ఇది రెండవసారి కావడం విశేషం. గ్రామంలో పిడుగు పడటంపై గ్రామస్తులకు చర్చలలో మునిగిపోయారు.
భారీ వర్షానికి తడిసిన ముద్దైన వరి ధాన్యం..
నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట, వెంకటాపూర్ (కె),నార్లపూర్, బచ్చురాజు పల్లి,నందిగామ, చల్మెడ,గ్రామాలలో పిడుగులతో కూడిన భారీ పలు గ్రామాలలో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.కొనుగోలు కేంద్రాలకు లారీలు సరిగా రాకపోవడం వల్లనే తూకం అయినటువంటి వడ్లు రైస్ మిల్లులకు తరలించకపోవడం వలనే రైతులకు ఇబ్బందులు కల్లాలలో నెల రోజుల నుండి వరి ధాన్యాన్ని ఎండబోసిన కాంటలు కావడం లేదని రైతు బోరున విలపించాడు. వర్షానికి ముందస్తు చర్య మరికొందరు రైతులు వడ్ల కుప్పలపై తాటిపత్రిలను వేసిన ఫలితం లేకుండా పోయింది ఈ భారీ వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. తడిసిన వడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.






