29 July, 2026 | 5:07 PM

కలెక్టర్ క్యాంపు కార్యాలయం పనులు తనిఖీ చేసిన కలెక్టర్

29-07-2026 04:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం పరిశీలించారు. అక్కడికి వెళ్లిన ఆయన ఇప్పటివరకు జరిగిన భవన నిర్మాణం పనులు పెండింగ్ పనులు చేపట్టవలసిన పనులను అడిగి తెలుసుకున్నారు. దసరా వరకు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ సుభాష్ తాసిల్దార్ ప్రభాకర్ అధికారులు ఉన్నారు.