29 July, 2026 | 5:06 PM

ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.

29-07-2026 04:13 PM

 -ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 

- అర్హులైన ప్రతి ఒక్కరి నమోదు పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు

బోధన్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి నమోదు పూర్తయ్యేలా అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్‌ పట్టణంలోని లైన్స్ క్లబ్ లో నిర్వహించిన  సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలాల వారీగా ఎస్‌ఐఆర్ నమోదు పురోగతిని సమీక్షించి, ఇంకా నమోదు చేసుకోని అర్హుల వివరాలను గుర్తించి వారిని నమోదు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నమోదు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే గ్రామస్థాయి నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.