4 June, 2026 | 11:19 PM

రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు

04-06-2026 05:57 PM

ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి నళిని రెడ్డి..

ఆదిలాబాద్, జూన్ 04 (విజయక్రాంతి) : మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకువచ్చిన వాటిని సక్రమంగా అమలు చేయని కారణంగా మహిళాలవై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని భారత జాతీయ మహిళ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి అన్నారు. గురువారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నళిని రెడ్డి సంఘం జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి మాట్లాడుతూ.... ప్రస్తుతం మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.

చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అత్యాచార వేధింపులు ఎదుర్కొంటున్నారన్నారు. మహిళల రక్షణ కోసం అమలవుతున్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు మహిళలకు రెండు వేలు ఇస్తామని ప్రకటించిందన్నారు. దాంతో పాటే ఆసరా పిన్షన్, దివ్యాంగుల వెన్షన్ ను వెంచుతామని చెప్పి రెండున్నర ఏండ్లు గడుస్తున్న నూతన వెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా మద్యం ఏరులై పరుతోందని, మద్యం మత్తులో చేస్తున్న నేరాలతో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. మహిళల రక్షణ, రిజర్వేషన్లు సాధించే వరకు కేంద్ర, రాష ప్రభుత్వాలపై ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి అమీనా ఖాన్, శ్యామల, దీప, లక్ష్మీ, పుష్ప, కాంతబాయి తదితరులు పాల్గొన్నారు.