కస్తూరిబా పాఠశాలలో సిమెంట్ రోడ్లకు ప్రతిపాదన పంపించండి
29-07-2026 04:16 PM
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల హీరపూర్ లోని కస్తూరిబా విద్యాలయంలో వర్షం పడితే బురద అవుతుందని, వెంటనే సిమెంట్ రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కస్తూరిబా విద్యాలయంలో 38 లక్షలతో అదనపు తరగతి గదుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. భవన నిర్మాణం పనులను నాణ్యతగా త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనతోపాటు డి ఈ జ్ఞానేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్, మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






