వర్షంలో డిజిటల్ వాటర్ భూగర్భ జలాల లెక్కింపు
29-07-2026 04:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను లెక్కచేయకుండా జిల్లా కలెక్టర్ వర్షంలో తిరుగుతూ వర్షపాతం నమోదులో పారదర్శకతపై సూచనలు చేశారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని భూగర్భం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిటల్ వాటర్ భూగర్భ జలాల లెక్కింపు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు ప్రతినెల లెక్కించాలని ప్రామాణికలు పాటించాలని భూగర్భ జిల్లా శాఖ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ గంగారెడ్డి జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు






