1 May, 2026 | 5:12 PM

వైశాఖ పౌర్ణమి.. వైభవంగా శివుడికి మహా రుద్రాభిషేకం

01-05-2026 04:05 PM

సుల్తానాబాద్ , మే 01 (విజయక్రాంతి):  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి (గుడి మిట్టపల్లి) శివాలయం లో  శుక్రవారం వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా స్వామివారికి మహా రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలను అర్చకులు పోలస అశోక్ లీల దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు,అనంతరం శివలింగం వద్ద మామిడికాయల అలంకరణ  దర్శనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది, అర్చకులు అశోక ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు... అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయం లో అర్చకులు వల్ల కొండ మఠం రమేష్, చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు దంపతులు, భక్తులు వైశాఖ పౌర్ణమి  పురస్కరించుకొని శివుడికి రుద్రాభిషేకం... ప్రత్యేక పూజలు నిర్వహించారు,