21 May, 2026 | 2:28 AM

రూ.5 వేల కోట్లు ఇవ్వండి

21-05-2026 12:45 AM
  1. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  2. రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీలేని రుణాలపై కేంద్రానికి కృతజ్ఞతలు
  3. గ్యాసిఫికేషన్‌కు సహకరించండి
  4. కోలిండియా తరహా ప్రాజెక్టులకు సింగరేణి రెడీ
  5. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో భట్టి భేటీ

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణకు ‘స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ పథ కం కింద రూ.5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహా యం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథ కం ద్వారా రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీలేని రు ణాల రూపంలో అందిస్తున్న సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిప్యూ టీ సీఎం భట్టి సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో చేపడుతు న్న భారీ పెట్టుబడులు, మూలధన వ్యయా లు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

2025--26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ కు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కొనసాగుతు న్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని డిప్యూటీ సీఎం వివరించారు. జిల్లాల వారీగా కొత్త మెడికల్ కళాశాలలు, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలు సామాజిక సమానత్వంతో కూడిన సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం కోసం మొత్తం రూ.30 వేల కో ట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్  సహకారంతో రూ.4,049.11 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్ర క్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్  సహకారంతో రూ.4,903.44 కోట్లతో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని భట్టి కోరారు. వికసిత భారత్- 2047 లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా, మౌలిక వసతుల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని, కేంద్రం మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. 

గ్యాసిఫికేషన్‌కు సహకరించండి

దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, సింగరేణి కూడా ఆ దిశగా ముంద డుగు వేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ... బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చే యకుండా, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే, సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికత తో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణికి కొత్త బొగ్గు వనరుల సమీకరణ అత్యవసరమని తెలిపారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ పరిధిలోని కొయ్యగూడెం బ్లాక్ తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కొయ్యగూడెం బ్లాక్-3ను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిచెర్ల కోల్ బ్లాక్-2 అంశంపైనా చర్చిస్తూ ఈ బ్లాక్‌కు సంబంధించి సింగరేణి ఇప్పటికే ప్రీ-మైనింగ్ కార్యకలాపాలు, అన్వేషణ పనులు చేపట్టిందని, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తాడిచెర్ల కోల్ బ్లాక్-2 అభివృద్ధి సింగరేణి భవిష్యత్ అవసరాలకు, తెలంగాణ విద్యుత్ భద్రతకు కీలకమని చెప్పారు. తాడిచెర్ల కోల్ బ్లాక్-2కు ఎంఎండీఆర్ చట్టం, 1957లోని సెక్షన్5 కింద ముందస్తు అనుమతి మంజూరు చేసి, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలపై కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.