21 May, 2026 | 2:19 AM

గిరిజన చట్టాలకు తూట్లు!

21-05-2026 12:48 AM
  1. యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
  2. చట్టాలకు వ్యతిరేకంగా భూములు, ఇండ్ల స్థలాలు బదలాయింపు
  3. భద్రాద్రి జిల్లా గుండాల మండలంలోని గ్రామాల్లో సమాంతర ప్రభుత్వం చెలామణి
  4. పనిచేయని కోర్టు ఆదేశాలు, తీర్పులు
  5. తెలిసినా పట్టించుకోని పోలీస్, రెవెన్యూ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వం 1/70, పెసా చట్టాలను అమలు చేశారు. ప్రభుత్వాలు మారినా, చట్టాలు ఎన్ని వచ్చి నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో నేటికీ సమాంతర ప్రభు త్వం చెలామణి అవుతున్నది.

కోర్టు ఆదేశా లు, తీర్పులకు సైతం ఇక్కడ గౌరవం లేదు. కోర్టు ఆదేశాలు ఎలా పనిచేస్తాయో చూస్తాం అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీస్, రెవె న్యూ శాఖల అధికారులకు అన్నీ తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం శోచనీయం. 

పెద్దమనుషులదే రాజ్యం

ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకా రం ఇళ్ల స్థలాలు, పొలాలు బదలాయించాలంటే గిరిజనులకు మాత్రమే బదలాయిం చాలి. అలాంటి బలమైన చట్టాన్ని సైతం గుండాల గ్రామంలో కొందరు పెద్దమనుషులుగా చెలామణి అవుతూ అపహాస్యం చేస్తు న్నారు. ఏది జరగాలన్న పంచాయతీ పెద్దల అనుమతి సమ్మతితో నడవాలనే హుకుం జారీ చేస్తున్నారు. వారి ఆదేశాలు వినని వారికి మానసిక, ఆర్థిక వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి పంచాయతీకి ఒక రేటును నిర్ణయించి బాధితుల నుంచి వసూలు చేసి పంచుకోవడం ఆ గ్రామ పెద్దల తీరని తెలుస్తోంది. అందుకే పార్టీలతో పని లేకుండా అంతా ఒక తాటిపైకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పెద్దల కు గ్రామంలో ధనవంతుల అండదండలు దండిగా ఉన్నాయనీ తెలుస్తోంది. 

భూములన్నీ గిరిజన ఇతరుల చేతుల్లోనే..

1985 నాటి నుంచి నేటి వరకు గ్రామం లో జరిగిన భూముల బదలాయింపులను పరిశీలిస్తే అన్ని తరహాల భూములు గిరిజనేతరుల చేతిలోకే మారాయి అని తెలుస్తోంది. ఇది ముమ్మాటికి గిరిజన చట్టాల ఉల్లంఘన. గ్రామంలో గతంలో పెత్తందారీ వ్యవస్థను సాగించిన ఓ కుటుంబం గుమ్మడవెల్లి వీరయ్యకు చెందిన పదుల ఎకరాల్లో పొలాలు, ఇళ్ల స్థలాలను కబ్జా చేసి వాటిపై ఎలాంటి హక్కు లేకున్నా పెత్తందారిగా గిరిజనేతరులకు విక్రయించి ధనార్జనకు పాల్పడిన చరిత్ర గ్రామంలో ఉంది.

పెత్తందారి వ్యవస్థకు ఎర్రజెండా పార్టీలతో పాటు ధనవంతులు అండ గా నిలవడం కొసమెరుపు. ఇప్పటికీ గ్రామం లో రోజుకో పంచాయతీ, నచ్చిన తీరులో తీర్పులు కొనసాగుతున్నాయి. గిరిజన హక్కుల పరిరక్షణ అంటూ గొప్పలు చెప్పుకునే తుడుందెబ్బ, నంగారాబేరి, లంబాడి హక్కుల పోరాట సమితి సంఘాలకు గిరిజన చట్టాల ఉల్లంఘన కనిపించడం లేదా అనే ప్రశ్నతో పాటు, పెత్తందారులు చెల్లించే నజరానాకు తలొగ్గి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని, అక్రమంగా భూములు బదిలాయించిన వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గుండాల మండల గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నూరు శాతం గిరిజన మండలం

గుండాల మండలం నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతం. ఈ మండలంలో ఎలాంటి భూ బదలాయింపులు జరగాల న్న గిరిజనులకే జరగాలి. గిరిజనేతరులకు బదలాయించడం 1/70 చట్టం ఉల్లంఘనే అవుతుంది. 

 ఖాసీం, తహసీల్దార్, గుండాల