27 April, 2026 | 11:46 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క

27-04-2026 10:11 AM

జనగణన తో పథకాల ప్రయోజనాలు సరిగ్గా అందుతాయి 

జనగణన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

ఖమ్మం,(విజయక్రాంతి): జనగణన (Census 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్ సైట్ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నాను. రాష్ట్రంలోని ప్రజలందరు జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ప్రజలంతా తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ భట్టి విక్రమార్క స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ విధానం ద్వారా జనగణనలో సమాచార సేకరణ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియలో భాగంగా, ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సరిగ్గా అందుతాయని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, టెక్నీకల్ అసిస్టెంట్ హిమవర్ష తదితరులు పాల్గొన్నారు.