27 April, 2026 | 11:47 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!

27-04-2026 10:03 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశమన్నారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని సూచించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం అన్నారు. 

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కేసీఆర్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు.