ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు
15-06-2026 09:00 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల కేంద్రం రాజుపేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క అప్పుల పాలైన రాష్ట్రాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న భట్టి విక్రమార్క భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నామన్నారు.






