8 April, 2026 | 10:18 PM

కష్టపడి పని చేస్తేనే శాఖకు గుర్తింపు

08-04-2026 08:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): షెడ్యూల్ కులాల పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అభిక్షేత్ర స్థాయిలో వెళ్లేలా అధికారులు కష్టపడి పని చేయాలని అడిషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీధర్ అన్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు జిల్లాలో అమలవుతున్న పథకాలు ఉపకార వేతనాలు సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అయితే అంశాలపై సమీక్షించి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు, ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారి దయానంద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు లత, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ మాణిక్ రావు తదితరులు ఉన్నారు.