8 April, 2026 | 10:20 PM

గౌడ సొసైటీ ఆధ్వర్యంలో కంఠమహేస్వామికి తాటి ముంజలతో అభిషేకం

08-04-2026 08:35 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లె లో బుధవారం గొల్లపల్లి గౌడ సొసైటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు పోన్నంనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కంఠమహే స్వామికి అభిషేకం నైవేద్యం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీ కంఠమయ స్వామికి గౌడులు కంఠమహేశ్వరమని తాటి ముంజలతో అభిషేకం చేసి చేసిన తర్వాతనే గౌడ్లకు సంబంధించిన పండుదాటి కల్లు గీయడానికి ముహూర్తం జరుగుతుంది.

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలనికంఠమహేస్వామిని వేడుకొని పండు తాళ్లు గీస్తావ్ ఉంటారు, ఆ స్వామిని మనసారా కోరుకుంటూ మొక్కి మొక్కులు సమర్పించారు, అలాగే ఊరిలో ఉండబట్టి దేవతలు పోచమ్మ మైసమ్మ ఎల్లవ్వ తల్లులకు ముంజకాయలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గొల్లపల్లి మాజీ ఎంపిటిసి మోలుగురి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ... కంటమైన స్వామిని గౌడుల ఆరాధ్య దైవం కాబట్టి అభిషేకం చేస్తూ ఏ ఆపద రాకుండా కాపాడాలని వారు చేసే వృత్తిలో నైపుణ్యం ఉండాలని వారిని ఏ ఆపద రాకూడదని ఆ భగవంతున్ని కంఠమహే స్వామిని మరి ఎల్లమ్మ తల్లిని కోరడం జరిగిందన్నారు. అలాగే నూతనంగా గౌడ వార్డు సభ్యులు మోలుగురి ప్రశాంత్ కుమార్ గౌడ్, మొలుగురి శ్రీనివాస్ గౌడ్ గుర్రం రమేష్ గౌడ్ లను ఘనంగా సన్మానించడం జరిగింది.