8 April, 2026 | 11:54 PM

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

08-04-2026 09:42 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో అండగా పనిచేస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, చింతకాయల సైదులు యాదవ్ అన్నారు. మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన కొందరు అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బుధవారం తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు గుండు వెంకటేశ్వర్లు, అమర గాని సైదయ్య, గుండుమట్టమ్మ, బాదే ధనమ్మ, అశోక్, ముత్తినేని సైదులు, పలువురీకి చెక్కులు అందించారు. కార్యక్రమంలో నాయకులు ముత్తినేని సోమయ్య, జుట్టు కొండ అంజయ్య పలువురు పాల్గొన్నారు