జిల్లాలో పీఎన్జీ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష
08-04-2026 09:38 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మేరకు జిల్లాలో పీ ఎన్ జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) కనెక్షన్ల ఏర్పాటు పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ అధికారి రాహుల్ సింగ్, పౌర సరఫరాల శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సమావేశమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పీ ఎన్ జీ పైప్డ్ నాచురల్ గ్యాస్ ద్వారా సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. తర్వాత కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎన్జీ ద్వారా సరఫరా చేయనున్నామని అధికారులు వివరించారు.




