2 May, 2026 | 12:12 AM

ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దీప కాసరగడ్డ

01-05-2026 10:42 PM

హుజూర్ నగర్: హుజూర్‌నగర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జిగా దీప కాసరగడ్డ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.నూతన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీనియర్,జూనియర్ న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిసి  స్వాగతం పలికారు.నూతన జడ్జికి మహిళ న్యాయవాదులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన జడ్జి దీప మాట్లాడుతూ... హుజూర్ నగర్ కోర్టులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా  కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులందరూ సమన్వయంతో స్నేహపూర్వక వాతావరణంలో సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు స్పోర్ట్స్ సెక్రటరీ అడవి రాముడు, గ్రంథాలయ సెక్రెటరీ ధూళిపాల శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు, మహిళా న్యాయవాదులు,  పాల్గొన్నారు.