మాజీ మంత్రి పువ్వాడను కలిసిన సోయం వీరభద్రం
01-05-2026 10:44 PM
దమ్మపేట,(విజయక్రాంతి): శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు సోయం వీరభద్రం, కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ప్రభుత్వ విప్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పార్టీ సంస్థగత పార్టీ నిర్మాణానికి, సభ్యత్వం నమోదు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సోయం వీరభద్రానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ భవిష్యత్ బి ఆర్ ఎస్ పార్టీదే నని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.






